ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం భేటీ అయ్యారు. ఎన్డీయే కూటమి తరుపున రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరు కూడా వినిపిస్తోంది. ఈ రోజు రాత్రి 7 గంటలకు బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్టీయే తరుపున పోటీ చేసే రాష్ట్రపతి అభ్యర్థిపై స్పష్టత రానుంది.