అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం లాంగ్ ఐల్యాండ్ ప్రాంతానికి చెందిన రగూసా (52)కి అక్కడి ప్రభుత్వం వికలాంగ పెన్షన్ ఇస్తోంది. దరఖాస్తు సమయంలో తాను 30 నిమిషాలు కూడా కూర్చోలేనని, కనీసం ముందుకు వంగలేనని పేర్కొన్నాడు. అయితే పెన్షన్ డబ్బుతో అతడు కార్లు అద్దెకిచ్చే సంస్థ పెట్టాడు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ బాడీబిల్డింగ్‌లో రాటుదేలాడు. తన భర్త కండలు వీడియో తీసి అతడి భార్య సోషల్ మీడియాలో పెట్టింది. అవి చూసిన అధికారులు కోర్టుకెళ్లారు. దీంతో కోర్టు 2 లక్షల డాలర్లు ప్రభుత్వానికి చెల్లించాలని తీర్పు ఇవ్వడంతో ఆ దంపతులు షాక్ తిన్నారు.