భారత రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము. మంగళవారం రాత్రి జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బీజేపీ అగ్రనేతలు ముర్ము అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మంగళవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ముర్ము అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. జార్ఖండ్ గవర్నర్గా పనిచేసిన ముర్ము చాలా కాలంగా బీజేపీలో ఉన్నారు. గిరిజన వర్గానికి చెందిన ఆమెను ఎన్డీయే అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.