గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ అదనపు బాధ్యతలను అప్పగించింది. ప్రభుత్వ స్కూల్లలోని విద్యార్థుల హాజరును గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తెలుసుకోవాల్సి ఉంటుంది. వారంలో ఒక రోజు స్కూళ్లు, విద్యార్థుల ఇళ్లకు వాలంటీర్లు వెళ్లాల్సి ఉంటుంది. స్కూళ్లల్లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేసి తల్లిదండ్రులతో సమావేశాలను వాలంటీర్లు నిర్వహించాల్సి ఉంటుంది.