సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం కేంద్రంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జ్ బి కె. పార్థసారథి ఆధ్వర్యంలో పంట నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్సూరెన్స్ ఇవ్వాలని రోడ్డుపై బైఠాయించి మెడకు ఉరితాల్లు బింగించుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి విజయభారతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, లీగల్ సెల్ అధ్యక్షులు శివశంకర్, కన్వీనర్ లక్ష్మీరెడ్డి, నంజుండప్ప, ఆదినారాయణ, శేఖర్, హనుమయ్య, మోద రవి, లక్ష్మీదేవమ్మ, ఈశ్వర్, చౌడప్ప, గోవిందరెడ్డి, గొల్లపలి అంజి, ప్రవీణ్ రెడ్డి, మధు, శ్రీధర్, సురేష్, అమీర్, లలితమ్మ, బేబీ, వెంకటేష్, ఆనంద్, బీరలింగ, నరేంద్ర, కిష్టప్ప, చంద్ర, మోదాశివ, సురేష్, గోపాల్, నాగభూషణం, రామరాజు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.