రాయచోటి కమీషనర్ పై వైకాపా కౌన్సిలర్ దాడిని ఖండిస్తూ శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో అధికారులు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ బండి శేషన్న మాట్లాడుతూ రాయచోటి మున్సిపల్ కమిషనర్ పై వైకాపా కౌన్సిలర్ దాడిచేయడం సరైంది కాదన్నారు. నిజాయితీగా ఉద్యోగాలు చేస్తే అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు దాడులు చేయడం దుర్మార్గం అన్నారు. కమీషనర్ పై దాడిచేసిన కౌన్సిలర్ పై కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ అసోషియేషన్ నాయకులు అసిస్టెంట్ కమీషనర్ రంగనాథ్, రెవిన్యూ అధికారి నాసిర్ హుస్సేన్, ఆర్. ఐ లు ఎర్రిస్వామి, రామాంజనేయులు, లైటింగ్ సెక్షన్ మహబూబ్ బాషా, ఖలీల్, మధుసూదన్ రెడ్డి(మధు)తదితరులు పాల్గొన్నారు.