ఎన్డీఏ కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ముర్ము నామినేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. నామినేషన్ పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు అందజేశారు. నామినేషన్ సందర్భంగా ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, గడ్కరీ, బీజేపీ రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ద్రౌపది ముర్ము ఒడిశాలోని సంతాల్ గిరిజన తెగకు చెందిన మహిళా నేత. ఆమె జార్ఖండ్ గవర్నర్‌గా చేశారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆమెకు జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతను కల్పించారు.