హత్యకేసులో సాక్షులకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేయడమే మాజీ మేయర్ హేమలత చేసిన నేరమా పోలీసులూ! అని టీడీపీ యువనాయకులు నారా లోకేష్ ప్రశ్నించారు. మీరు ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న పోలీసులా! వైఎస్ జగన్ మాఫియా రెడ్డి ఫ్యాక్షన్ నడిపే ప్ర్రెవేటు సైన్యమా? అని అడిగారు. చిత్తూర్ మేయర్ దంపదుల హత్య కేసులో సాక్షులని పోలీస్ వారు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు అని తెలియజేసారు. అలానే పోలీసులే అమాయకుడైన పూర్ణ జేబులో గంజాయి పెట్టి అమ్ముతున్నాడని అరెస్టు చేయడం..ఇదేం అన్యాయం అని నిలదీసిన హేమలత మీద నుంచి పోలీసు వాహనం పోనిచ్చారంటే వీళ్లంతా పోలీసులు కాదు. వైసీపీ ఫ్యాక్షన్ టీం అని ఆరోపించారు. రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ఒక పార్టీకి కొమ్ము కాయడం నీచమైన చర్య అని, ప్రజా పరిపాలనలో ఇలాంటివి సరైన పద్ధతులు కావు అని హెచ్చరించారు.