యస్ రాయవరం మండలంలోని మేజర్ పంచాయితీ దార్లపూడి గ్రామంలోని చెక్ పోస్టు వద్ద ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలునిద్రపొతున్నాయి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులకు నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే చెక్ పోస్టు వద్ద ఏర్పాటు చేసిన కెమెరాలు రోడ్డు వైపు కాక కిందివైపుకు వంచి ఉండడం పలు అనుమానాలకు దారితీస్తుంది. దార్లపూడి వరహానది నుండి తెల్లవారుఝూమున యధేచ్ఛగా ఎడ్లబళ్ళపై ఇసుక రవాణా జరుగుతుంది. ఇసుక అక్రమ వ్యాపారులతో చెక్ పోస్టు సిబ్బంది లాలూచీ పడడం మూలంగానే కెమెరాలలో రికార్డింగు అవ్వకుండా కిందికి వంచి వుంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైన ప్రభుత్వం నిర్ధేశించిన ఆదేశాల మేరకు కెమెరాలు పనిచేసే దిశగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.