హుకుంపేట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హుకుంపేట మండలంలోని తీగలవలస పంచాయితీ గడప గడప కార్యక్రమంలో వెళ్లిన అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణకు చుక్కెదురైంది.
సర్పంచులు, ఎంపీటీసీలు ఎంపీపీ, జెడ్పిటిసి, మండల అన్ని శాఖ అధికారులు కలిసి తొలిత పంతెలిచింత గ్రామంలో పర్యటించారు అనంతరం తీగల వలస గ్రామంలో పర్యటిస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన వంతాల కొండమ్మ తమకు ఉండడానికి ఇల్లు లేదని గత ఏడాది నుంచి మా బాబుకు అమ్మఒడి రాలేదని ఎన్నిసార్లు వాలంటీర్లకు అధికారులు కలిసినా ఫలితం లేదని ప్రశ్నించింది,
దీంతో ఆమెకు ఎమ్మెల్యే నాయకులూ సర్ది చెప్పి గ్రామం లో పర్యటించారు, అనంతరం అదే పంచాయతీకి చెందిన కొంతమంది అయ గ్రామ ప్రజలు రహదారులు మంచినీరు చెక్ డమ్లు గురించి అలాగే తీగల వలస నుంచి కిన్నెరులోవ, కామయ్యా పేట నుంచి గుర్రాలతోట, కొనగరువు నుంచి పామురాయి, అమురు వరకు రోడ్డు నిర్మాణం పనులు ఎందుకు ఆగిపోయింది అంటూ వర్షాలకు కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నమంటూ ఎమ్మెల్యేను ప్రజలు అధికార పార్టీ వైస్ సర్పంచ్ కే. ఆనంద్, ఎస్. సూరిబాబు కీల్లో. కోటి బాబు, ఎస్. బాలరాజు, ఎస్. చంద్రబాబు, బి. మోహన్, పి. త్రినాధ్, ఎం. జాన్, వి. బిమరాజు, తదితరులు ప్రశ్నించారు ఎంపీపీ కూడా రాజబాబు దత్తత గ్రామం మా పంచాయతీ పరిధిలోని ఏ యొక్క అభివృద్ధి పనులు జరగడం లేదంటూ వారు ప్రశ్నించాగా వెంటనే ఎమ్మెల్యే, ఎంపీపీ కూడా రాజు బాబు ఇంజనీరింగ్ కాంట్రాక్టు తో మాట్లాడి బిల్స్ లేక డబ్బు రాలేదని వారు అనడంతో ప్రజలు మరింత ఉధృతమయ్యారు డబ్బు లేకపోతే ఈ పనులు ఎందుకు చేపట్టి మధ్యలో ఆపివేయడం ఎందుకని వారు మండిపడ్డారు ఎంపీపీ, సర్పంచ్ ఎంపీటీసీ, నాయకులకు కార్యకర్తలకు దీంతో ప్రతి పేదవాడికి నవరత్నాల పథకాలు ద్వారా సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అది సరిపోలేదు అంటూ వారు చెప్పడంతో వారి మధ్య పెద్ద రభస గా మారింది సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదు అభివృద్ధి చేయాలి అంటూ అడ్డుకొని మరి ప్రశ్నించారు.
నాయకులకు ప్రజలకు మధ్య ఒక 20 నిమిషాల పాటు వాగ్వాదం జరిగింది మా ఎమ్మెల్యే కు మీరు ప్రశ్నించడం సరికాదంటూ కొంతమంది చోటా పోట నాయకులు సర్ది చెప్పేనా గ్రామ ప్రజలు ఊరుకోలేదు దీంతో అక్కడ ఉద్రిక్తత నెల కొంటుదని భావించి ఎమ్మెల్యే అర్థంతరంగ కార్యక్రమం ముగించి గాలిపడు గ్రామానికి వెళ్లారు దీంతో గ్రామ ప్రజలకు ఎంపీపీ, సర్పంచ్ ఎంపీటీసీ, నాయకులు కార్యకర్తలు మా ఎమ్మెల్యేకు ప్రశ్నిస్తారా అంటూ ప్రజలపై తిరగబడడం తో తమ సమస్యలు పరిష్కరించాలంటూ విన్నవించుకోవడం మ తప్ప మేము ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే గారినే కదా మేము అడిగేది అంటూ ప్రజలు వాపోయారు. పంచాయతీలోని 26 గ్రామాలు ఉన్నాయనీ అక్కడ అనేక సమస్యలు ఉన్నాయనీ ఆ గ్రామాలకు కూడా రావాలి కదా అని వాళ్ళు అన్నారు.
గ్రామస్థాయిలో సమస్యలను ఎమ్మెల్యేకి విన్న వించే క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆ మూరు గ్రామం లోని కి వెళ్ళాల్సి ఉండగా గలిపాడు గ్రామం వెళ్లి బోర్ ఓపెన్ చేసిన అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూడా రాజబాబు, జెడ్పిటిసి రెగం మత్య్సలింగం, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి నైనీ. సత్తిబాబు, జిల్లా వ్యవసాయ శాఖ సలహామండలి సభ్యుడు విశ్వేశ్వరరావు, ఎంపీడీఓ సాయిసుధా, ఎంఈవో, రామచంద్ర రావు, సి డి పి ఓ బాలమణి దేవి, హౌసింగ్ అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు, వైసిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.