గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని ఆలూరు గ్రామంలో యువకుడిని హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. పొన్నూరు రూలర్ ఎస్సై భార్గవ్ తెలిపిన వివరాల ప్రకారం అక్రమ సంబంధం నేపథ్యంలో యువకుడిని మహిళ భర్త, మరిది హత్య చేశారన్నారు. కర్రలతో దాడి చేసి హత్య చేశారన్నారు. సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నామని మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు.