ముస్లింల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కటికం అంకారావు విమర్శించారు. గురజాల పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పసుమర్తి, మణి, సలీమ్, ప్రసాద్, అజీజ్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.