సరిగ్గా 39 ఏళ్ల క్రితం ఇదేరోజు భారత క్రికెట్లో సంచలనం నమోదైంది. 1983లో భారత్ తొలి ప్రపంచకప్‌ను గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 183 రన్స్‌కు ఆలౌట్ కాగా, విండీస్‌ను 140 రన్స్‌కే కట్టడి చేసి కప్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ 38, అమర్నాథ్ 26 రన్స్ చేయగా. బౌలింగ్‌లో అమర్నాథ్, మదన్‌లాల్ చెరో 3 వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బతీయగా, అమర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.