బీహార్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్లు సహా 12 మంది అమ్మాయిలను పెళ్లిచేసుకుని బలవంతంగా వ్యభిచారంలోకి లాగిన వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. కిషన్ గంజ్ జిల్లా అనార్కలి గ్రామానికి చెందిన మహ్మద్ షంషాద్ అలియాస్ మనోహర్ మైనర్ బాలికలే టార్గెట్‌గా పెళ్లాడి, వారిని వ్యభిచారంలోకి దించుతున్నాడు. అయితే 2015లో తొలిసారిగా మనోహర్‌పై కేసు నమోదైనట్లు పోలీసుఅధికారి పృథ్వీపాశ్వన్ తెలిపారు.