మార్స్ ఉపరితలంపై నాసా శాస్త్రవేత్తలు చిత్రమైన ఆకారాలను గుర్తించారు. స్వ్రేర్ గుర్తులు, అక్కడక్కడా నలుపు, నీలం రంగు విసిరేసినట్టుగా ఉన్న ఆకృతులను ‘హై రిజల్యూషన్ ఇమేజింగ్ ఎక్స్ పెరిమెంట్(హైరైజ్)’ కెమెరాతో మార్స్ రీకన్నేసన్స్ ఆర్బిటర్ ఉపగ్రహం చిత్రించింది. అయితే, అంగారకుడి ధ్రువ ప్రాంతాల్లో మట్టి పొరల కింద మంచు ఉన్నట్టు వేసవి రాగానే ఆవిరై పైకి ఎగజిమ్మి పగుళ్లు ఏర్పడి ఉంటాయని అంచనా వేశారు.