ఆగ్రాలో ఓ అపార్ట్మెంట్లో రితికా సింగ్ ఆనే వివాహిత హత్యకు గురైంది. మాజీ భర్త ఆకాశ్ గౌతమ్‌తో 2018లో విడాకులు తీసుకున్నప్పటినుండి ఆమె తన స్నేహితుడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటుంది. ఆమె మాజీ భర్త, మరో ఇద్దరితో శుక్రవారం ఆమె నివాసం వద్దకు వచ్చి దాడి చేశారు. అనంతరం వారు రితికా చేతులు కట్టేసి నాల్గో అంతస్తు నుంచి కిందకు తోసి చంపేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది.