ముంబైలో 2008లో జరిగిన ఉగ్రదాడుల్లో నిందితుడైన సాజిద్ మజీద్ మీర్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఫైనాన్సింగ్ కేసులో పాకిస్థాన్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. సాజిద్ మజీద్ మీర్ తలపై అమెరికాలో 50 లక్షల డాలర్ల రివార్డ్ ఉంది. ఈ నెల ప్రారంభంలో లాహోర్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు తీవ్రవాద ఫైనాన్సింగ్ కేసులో నిషేధిత లష్కరే తోయిబా కార్యకర్త మజీద్ మీర్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది.