దేశంలో కొవిడ్ కేసులు కాస్త తగ్గాయి. ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం శుక్రవారం సుమారు 18 వేల కేసులు నమోదవగా, శనివారం 15,940కి తగ్గాయి. గడచిన 24 గంటల్లో 25 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,24,999 చేరుకుంది. గత 24 గంటల్లో కొవిడ్ నుంచి 10,917ల మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 92,576ల యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత ఐదు నెలల్లో ఇది గరిష్టం.