ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలుడు బోరు నీరు తాగాడని దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 26, 2022, 05:08 PM

విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమ‌ర్ల మండ‌లం మ‌ల్యాడ గ్రామంలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లతో రెండు వర్గాల వారు ఘర్షణకు దిగి పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి గాయల‌య్యాయి. గ్రామంలో పోలీసులు భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. బాలుడు నీరు తాగ‌డం వ‌ల్లే ఈ ఘ‌ర్ష‌ణ జ‌రిగింద‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ దాడిలో దాదాపు 8 మందికి తీవ్రగాయాలు కావ‌డంతో చికిత్స కోసం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com