జూలై 1 నుంచి కొత్త కార్మిక చట్టాలను అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఈ కొత్త చట్టాల ప్రకారం వారంలో 4 రోజులు మాత్రమే పని చేయాలి. వారంలో 4 రోజులు పని చేస్తే 3 వీక్లీ ఆఫ్లు ఉంటాయి. అయితే ఆ 4 రోజుల్లో రోజుకు 12 గంటలు పని చేయాలి. ఒకవేళ సదరు కంపెనీ 8 గంటలు మాత్రమే పనిచేయించుకుంటే వారానికి ఒక్క రోజే వీక్లీ ఆఫ్ ఉంటుంది. ఈ కోడ్ కేవలం ప్రైవేటు ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.