రోజువారీ కూలీలతో వెళ్తున్న క్రూజర్ వాహనం ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. కర్ణాటకలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో అక్కడిక్కడే ఏడుగురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. అతివేగంతో వెళ్తూ వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. వాహనంలో 18 మంది ప్రయాణికులు రోజువారీ పనుల కోసం వెళ్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa