ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని ప్రియుడి దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళ్లితే.. మహారాష్ట్రకు చెందిన రాజేష్, భారతీలు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించటంతో లేచిపోయి పెళ్లి చేసుకుందామని రాజేష్ అన్నాడు. అందుకు భారతీ అంగీకరించలేదు. దీంతో ఆమెపై రాజేష్ కోపాన్ని పెంచుకున్నాడు. అదును చూసి నడిరోడ్డుపై కత్తితో దాడి చేశాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.