సౌతాఫ్రికాలోని ఈస్ట్ లండన్ సిటీలోని ఓ నైట్ క్లబ్ లో ఆదివారం 22 మంది అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అయితే మృతుల శరీరాలపై ఎలాంటి గాయాలు లేవని, వారి చనిపోవడానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని పోలీసులు తెలిపారు. మృతుల బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మొదట ఇక్కడ 17 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మృతుల సంఖ్య 22 కి పెరిగినట్లు తెలిసింది.