అలాస్కా సరిహద్దులో ఉన్న కెనడాలోని యుకాన్ మంచు ప్రదేశంలోని బంగారు గనుల్లో జరిపిన తవ్వకాల్లో ఓ యువ బృందం అరుదైన మమ్మీ అవశేషాలను కనుగొన్నారు. ఇది ఒక ఆడ జంతువుగా వారు గుర్తించారు. ఈ మమ్మీకి 'నన్ చో(పెద్ద పిల్ల)' అనే పేరు పెట్టారు. ఇదిలా ఉండగా 2007లో సైబీరియాలో గుర్తించిన 42 వేల ఏళ్ల నాటి 'లియుబా' , నన్ చో రెండు దాదాపు ఒకే పరిమాణంలో ఉండటం గమనార్హం. అయితే, నన్ చో మమ్మీ అత్యద్భుతమైన మమ్మీలలో ఒకటి.