చదువుకోవటం లేదని మేనత్త మందలించినందుకు ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని మేనల్లుడు మృతిచెందిట్టు మేనత్త సుబ్బాయమ్మ ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గల పొత్తూరునికి చెందిన సుబ్బాయమ్మ మేనల్లుడు రామరాజు కొన్నేళ్లుగా తన ఇంటి వద్దనే ఉంటూ చదువుకుంటున్నాడు. ఈనెల 24న చదువుకోకుండా టీవీ చూస్తున్నాడని మేనత్త మందలించడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.