లవంగాలను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పంటి నొప్పితో బాధపడే వారు లవంగాన్ని నోటిలో వేసుకుంటే ఉపశమనం కలుగుతుంది.భోజనానికి ముందు ఒకటి తింటే అజీర్తి ఉండదు. నోటి దుర్వాసనను తొలగించడంలో కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. లవంగాలను వేయించి తరుచుగా నమిలి తింటుంటే దగ్గు, శ్వాసకోశ సమస్యలు దరిచేరవు.