తాడేపల్లి మండలం పెనుమాక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో యర్రబాలెంకి చెందిన రైతు దానబోయిన శివశంకరరావు 2020 సెప్టెంబరు 28వ తేదీన బంగారు వస్తువులు తాకట్టు పెట్టి రూ.1. 80 లక్షలు రుణం తీసుకున్నాడు. ఈ ఏడాది మేలో నగదు చెల్లించి బంగారు నగలను తీసుకెళ్లేందుకు సంఘం కార్యాలయానికి వెళ్లాడు. లాకర్లో బంగారు నగలు లేవని తెలుసుకున్నాడు. సంఘం ఛైర్మెన్ సూచనల మేరకు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa