నాడు - నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నారు. ప్యాపిలి పట్టణంలో దాదాపు రూ. 2. 5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఆర్బీకే, గ్రామ సచివాలయ భవనాలను ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.