కోడుమూరు పట్టణానికి చెందిన కటిక దౌలత్ బాషా అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు చోరికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బాధితులకు చెందిన ఆరు తులాల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండిని అపహరించుకు వెళ్లారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై సంపత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదివారం తెలిపారు. వాటి విలువ రూ. 2. 12 లక్షలు ఉంటుందని ఏఎస్సై తెలిపారు.