నందికొట్కూరు మండలం మల్లెల గ్రామంలో ఆదివారం రోహిత్ అనే నాలుగు సంవత్సరాల బాలుడు నీటి లో పడి మృతి చెందాడు. తల్లిదండ్రులు రవి, హేమలత పొలానికి వెళ్లారు. ఇంటి వద్ద వున్నా రవికుమార్ తల్లి మల్లమ్మ రోహిత్ కు స్నానం చేయిస్తానని బట్టలకోసం ఇంటిలోకి వెళ్లారు. ఆ సమయంలో బాలుడు ఇంటి బయటకి వచ్చి ప్రమాదవశాత్తు మెట్ల పక్కన ఉన్న నీటి డ్రమ్ము లో పడి మృతి చెందాడని స్థానికులు తెలిపారు.