మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన కృష్ణమూర్తికి బడిపంతులుగా అవకాశం దక్కింది. బీఈడీ పూర్తి చేసుకున్న ఆయన 2008 దాకా డీఎస్సీ రాస్తూనే వచ్చారు. అయితే 1998 డీఎస్పీ రాసినప్పటికి ఫలితాలు రాలేదు. అయితే ఎట్టకేలకు 1998 డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం తీపికబురు అందిస్తూ ఉద్యోగ అవకాశం కల్పించింది. అయితే తనను కష్టకాలంలో ఆదుకొన్న వ్యవసాయాన్ని వీడనని, ఉపాధ్యాయునిగా చేస్తూనే వ్యవసాయం చేస్తానని అన్నారు.