సోమవారం ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఉన్నట్టుండి పొగలు వ్యాపించాయి. రైలు లోని ఏసీ బోగీలో పొగలు వ్యాపించడంతో డోర్నకల్ జంక్షన్ వద్ద ఆపివేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే డోర్నకల్ జంక్షన్ రైల్వేస్టేషన్‌కు చేరుకొని, పొగలు వచ్చిన బోగీని వేరు చేసి ప్రయాణికులను మరో బోగీలోకి ప్రయాణికులను పంపించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.