పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగారావు అధ్యక్షత న జరిగిన నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షురాలిగా ముఖ్య అతిథిగా పాములా పుష్ప శ్రీవాణి పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో Deputy CM రాజన్న దొర ,జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ రావు ,MLC రఘురాజు , వాకాడ నాగేశ్వరరావు నియోజకవర్గంలో ని మున్సిపల్ ఛైర్మన్, ZPTC లు,MPP లు,మండల పార్టీ అధ్యక్షులు,MPTC లు, సర్పంచ్ లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సంద్రాభంగా ఆమె మాట్లాడుతూ... సీఎం జగన్ మాట తప్పే రకం కాదు అని చెప్పిన అన్ని వాగ్దానాలు నెరవేరుస్తారు అని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కూడా వైసీపీ పార్టీకి అందరూ అండగా ఉండాలని కోరారు.