ఏడవటం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. కన్నీరు వల్ల కళ్ళల్లో ఉన్న దుమ్ము, మలినాలు బయటికెళ్లిపోతాయి. ఏడిస్తే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. అది గుండె సంబంధిత సమస్యల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఏడుపు అనేది డిప్రెషన్ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కన్నీరుతో ఒత్తిడి అనేది దూరమవుతుంది. కన్నీరు బయటకు రావడం వల్ల కళ్లు ప్రశాంతంగా ఉంటాయి. ఏడుపు వల్ల మనసులోని బాధ తగ్గి మనస్సు చాలా తేలికవుతుంది.