అనంతపురం జిల్లా పోలీసు శాఖ వినూత్న ఆలోచనతో 'సెల్ ఫోన్ బాధితులకు సత్వర న్యాయం' పోలీసు స్టేషన్ కు వెళ్లకుండా, ఫిర్యాదు చేయకుండా కేవలం వాట్సాప్ సమాచారం స్వీకరణతో మొదలుపెట్టిన మొబైల్ ఫోన్ల రికవరీ అద్భుత ఫలితాలు సాధించింది. మూడు నెలలు కూడా గడవకనే సోమవారానికి ఒక కోటి రూపాయల విలువ చేసే1024 ఫోన్లు రికవరీ చేసి ముట్ట జెప్పతుండటంతో బాధిత ప్రజలు హర్షం వెలిబుచ్చుతున్నారు.