గుత్తి మున్సిపల్ పరిధిలోని సూరసింగన పల్లి చెరుకు వద్ద గుత్తి ఆర్ఎస్ కు చెందిన సుధాకర్ అనే రైల్వే ఉద్యోగి సోమవారం క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న సుధాకర్ ను స్థానికులు గుర్తించి 108 కు సమాచారం ఇచ్చారు. వెంటనే సుధాకర్ ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదని, వివరాలు విచారణలో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.