రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు విద్యాశాఖ ద్వారా అడుగులు వేస్తోందని కలెక్టర్ అన్నారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో అమ్మఒడి నగదు తల్లుల ఖాతాలో జమచేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళంలో సీఎం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడాన్ని అందరూ తెరపై వీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న అమ్మఒడి పథకంలో భాగంగా జిల్లాలో 1, 53, 345 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 230 కోట్లు జమ అయిందన్నారు.