ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన వారు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పొన్నలూరు టి రమేష్ బాబు తమ సిబ్బందితో కలసి దాడి చేసి సోమవారం రెండు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అక్రమ మద్యం, అక్రమ ఇసుక రవాణా, జూదం, పేకాట, నాటుసారా, పాన్ పరాగ్ లాంటి నిషేధిత అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతామని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.