సింగరాయకొండ మండలం పాకల పోస్టాఫీసులో 10 లక్షల నిధులు గోల్ మాల్ అయినట్లు తెలుసుకున్న అధికారులు విచారణ చేపట్టినట్లు గ్రామస్థులు మంగళవారం తెలిపారు. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో ఖాతాదారుల చేత డబ్బులు కట్టించుకుని, అవి ఎంట్రీ కాకపోవడంతో విషయం బయటకు పొక్కింది.
ఇందిరమ్మ అనే మహిళ రూ.లక్ష పోస్ట్ ఆఫీస్ లో వేసి,10వేలు డ్రా చేసేందుకు మరల రాగా, అసలు విషయం తెలిసింది. దీంతో అధికారులు విచారణ చేపట్టి 10 లక్షల గోల్ మాల్ అయినట్లు గుర్తించారు.