కనిగిరి డివిజన్ పరిధిలో రూ. 14 కోట్ల పైన విద్యుత్ బకాయిలు ఉన్నట్లు కనిగిరి ఈఈఎమ్ నాగమల్లేశ్వర రావు తెలిపారు. వ్యవసాయం సంబంధించి రూ1. 35 కోట్లు, గృహాలకు సంబంధించి రూ.2. 37 కోట్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి రూ.8. 32 కోట్లు, ఇతర బకాయిలు రూ.83 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు.
బకాయిదారులకు వెసులుబాటు కల్పించి వసూలు ప్రయత్నం చేస్తునట్టు తెలిపారు. బకాయిలు చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామని తెలిపారు.