ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని వివేక కుమార్తె నర్రెడ్డి సునీత హైకోర్టును కోరింది.
వివేక హత్యకు ప్లాన్ చేయడం నుంచి సాక్ష్యాలను ధ్వంసం చేసే వరకు శివశంకర్రెడ్డిదే కీలక పాత్ర ఉందని ఆమె తరఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. విచారణ పూర్తయ్యే వరకు ఆయనకు బెయిలు ఇవ్వొద్దని కోర్టును కోరారు.