తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. సోమవారం శ్రీవారిని 74,288 మంది భక్తులు దర్శించుకున్నారు.
36,473 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు వచ్చింది. మే నెలలో రూ.129.93 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది వార్షిక ఆదాయం రూ.1500 కోట్లు దాటే అవకాశం ఉంది.