బెెంగళూరుకు చెందిన శ్రీనగేష్ తన కుటుంబంతో కలిసి నిత్యానందాశ్రమంకి వెళ్లారు. కొన్ని రోజులు అక్కడే ఉండి తిరిగి అతని భార్య,పెద్ద కూతురు వైష్ణవితో కలిసి ఇంటికి వెళ్లిపోయారు. అయితే చిన్న కుమార్తె వరూధిని ఆశ్రమంలోనే ఉండిపోయింది.
తిరిగి కూతురుని ఇంటికి తీసుకురావడానికి తండ్రి వెళ్లగా వరూధిని అక్కడలేదు అని నిర్వాహకులు తెలిపారు. తన కూతురుని రక్షించాలని తండ్రి ఆదివారం తమిళనాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.