దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 239.41 పాయింట్లు నష్టపోయి 52,921.87 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 82.75 పాయింట్లు నష్టపోయి 15,749.30 వద్ద కొనసాగుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.78.59 గా ఉంది. పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంకు, మారుతీ, భారతీ ఎయిర్ టెల్ షేర్లు నష్టాల్లో ఉండగా, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.