అనంతపురం జిల్లా, పోలీసు స్టేషన్ కు వెళ్లకుండా FIR నమోదు చేయకుండా కేవలం వాట్సాప్ మేసేజీతో చోరీ/మిస్ అయిన సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందిస్తున్న విషయం తెలిసిందే. CHAT BOTసేవలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రజలకు సేవలు మరింత సులువుగా ఉంటుంది. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ముందుగా 9440796812 నంబర్ వాట్సాప్ కు HI / HELP అని పంపాలి.. ఆ తర్వాత వెనువెంటనే Welcome to Anantapur police పేరున ఒక లింకు HI / HELP అని పంపిన మొబైల్ కు వస్తుంది. ఆ లింకులో గూగుల్ ఫార్మట్ ఓపెన్ అవుతుంది. ఆ వివరాలను పూరించాలి. డిస్ట్రిక్ట్ , పేరు, వయస్సు, తండ్రి, చిరునామా, కాంటాక్టింగ్ నంబర్ , మిసయిన మొబైల్ మోడల్ ,IMEI నంబర్, మిస్ అయిన ప్లేస్ , తదితర వివరాలను సబ్ మిట్ చేయాలి. వెంటనే కంప్లైంట్ లాడ్జి అవుతుంది. CHAT BOT" సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పీ విజ్ఞప్తీ చేశారు. కేవలం వాట్సాప్ మెసేజీ సమాచారంతో రికవరీ చేసిన సెల్ ఫోన్లలో ఈరోజు జిల్లా ఎస్పీ 300 మొబైల్ ఫోన్లను సంబంధిత బాధిత ప్రజలకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అందజేశారు. ఇప్పటి వరకు రూ. ఒక కోటి విలువ చేసే 1079 సెల్ ఫోన్లు రికవరీ చేశారు. వీటిలోచాలా వరకు సెల్ ఫోన్లను బాధితులకు ముట్టజెప్పారు. మిగితా వారికి కూడా ఇంకా సెల్ ఫోన్లను అందజేసేందుకు బాధితులకు సమాచారం కూడా పంపారు. వీటిని కూడా త్వరలోనే అందజేయనున్నారు. CHAT BOT ను రూపొందించడంలో సహకరించిన మణికంఠను జిల్లా ఎస్పీ శాలువా కప్పి సన్మానం చేశారు. ఫోన్ చోరీకి గురయినా... మిస్ అయినా వెంటనే జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ 9440796812 కు HI లేదా HELP అని మెసేజీ పంపాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, పోలీస్ టెక్నికల్ వింగ్ ఎస్సై సుధాకర్ యాదవ్ , తదితరులు పాల్గొన్నారు.