ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఒంటిమిట్ట మండల ఎంపిపి గడ్డం జనార్దన్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తున్నారన్నారు ఈ తరుణంలో రైల్వే స్టాపింగ్ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి కి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైల్వే స్టేషన్ అభివృద్ధితోపాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలన్నారు