8 సీటర్ కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండేలా ప్రభుత్వం తప్పనిసరి చేస్తుందని మంగళవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇంటెల్ ఇండియాస్ సేఫ్టీ పయనీర్స్ కాన్ఫరెన్స్ 2022 లో గడ్కరీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఏటా 5 లక్షల ప్రమాదాల్లో 1.5 లక్షల మంది చనిపోతున్నారు. మోటారు వాహనాల్లో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరిగా అందించాలని నిర్ణయించాం. ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాం అని మంత్రి తెలిపారు.