ఉత్తరప్రదేశ్ లఖింపుర్ ఖేరిలో 21 మందిని వేటాడి చంపిన ఆడపులిని సోమవారం రాత్రి అటవీ అధికారులు బంధించారు. గతవారం రోజుల్లోనే ఐదుగురిని చంపిన ఈ పులిని కొన్ని రోజుల పాటు బోనులోనే ఉంచనున్నట్లు దుధ్వా ఫీల్డ్ డైరెక్టర్ సంజయ్ పాఠక్ తెలియజేశారు. వైద్యులు, వన్యప్రాణి నిపుణుల సంరక్షణలో పులిని ఉంచుతూ, దాని ఆరోగ్యాన్ని కాపాడేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.