ఏపీలో వైసీపీ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. బాలినేని తరహాలోనే తనకూ కోవర్టులతో ఇబ్బందిగా ఉందన్నారు. కొందరు వైసీపీ నేతలు ప్రతిపక్షాలతో కుమ్మక్కై, పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారన్నారు. బాలినేని మూడు జిల్లాలకు పార్టీ ఇన్‌ఛార్జి అని, అలాంటి వ్యక్తి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరించొద్దని పార్టీ నేతలకు సూచించారు.