--- ప్రపంచంలో అచ్చు మీ పోలికలతోనే ఉండే వాళ్ళు మొత్తం ఆరుగురు ఉంటారట. మీతో కలిపి మొత్తం ఏడుగురు. ఈ విషయం అందరికి తెలిసుండొచ్చు. తెలియని విషయమేంటంటే, జీవితకాలంలో మీలానే ఉండే ఆరుగురిలో కనీసం ఒకరినైనా మీరు కలుసుకుంటారు. ఐతే అందుకు కేవలం తొమ్మిది శాతమే అవకాశం ఉంది.
--- ఒక వ్యక్తి పొడుగు అతని/ఆమె తండ్రి పొడుగును బట్టి నిర్ణయింపబడుతుంది. అలానే ఒక వ్యక్తి బరువు ఆమె/అతని తల్లి బరువు మీద ఆధారపడి ఉంటుంది.
--- రోజుకు 11 గంటల కన్నా ఎక్కువసేపు కూర్చుని ఉంటే, వచ్చే మూడు నెలల్లో చనిపోయే అవకాశం యాభై శాతం వరకు ఉంది. అందుకే ఏకధాటిగా అలానే కూర్చుని పనిచెయ్యకుండా, అప్పుడప్పుడు పైకి లెగుస్తూ ఉండండి.
--- మనకు జలుబు చేసిన సమయంలో మన వేళ్ళ గోళ్లు సాధారణం కన్నా మరింత ఎక్కువ వేగంగా పెరుగుతాయి.